ఆయిల్ ధరలు తగ్గించాలని…ఢిల్లీలో కేంద్రమంత్రి నిరసన

దేశంలో ఆయిల్ ధరలు రోజురోజుకి పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ధరలను తగ్గించాయి. అయితే.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మాత్రం పెట్రో, డీజీల్ రేట్లను ఎందుకు తగ్గించట్లేదని కేంద్రమంత్రి విజయ్ గోయల్ నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం(అక్టోబర్-7) సాయంత్రం ఢిల్లీలోని చాందినిచౌక్‌ లో ఎద్దుల బండెక్కి రోడ్డు పైకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాడు. ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఏవిధంగా అయితే చమురు ధరలు తగ్గించాయో…ఢిల్లీ ప్రభుత్వం కూడా అలాగే తగ్గించి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, ఢిల్లీ వాసులు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates