ఆయిల్ ధరల పెరుగుదల…ఇబ్బందుల్లో పొటాటో రైతులు

POTATOపెట్రోల్ ,డీజిల్ ధరల పెరుగుదలతో ఉత్తరప్రదేశ్ లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ లోని బంగాళదుంప రైతులు ఆయిల్ ధరల పెరుగుదలతో ట్రాన్స్ పోర్టేషన్ చార్జీలు పెరగడంతో తమ పంటను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఒక గోదాంకి 20 రూపాయలు ట్రాన్స్ పోర్టేషన్ చార్జీ ఉండేదని, ఆయిల్ ధరల పుణ్యమా అని అది ఇప్పుడు 25 రూపాయలకు చేరుకొందని, ఏ ఒక్క వ్యాపారి కూడా రైతుల పంటను కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో బంగాళదుపలన్నీ తెగులుపట్టిపోతున్నామని బంగాళదుంప వ్యాపారి అలీ తెలిపారు. 5 రోజుల నుంచి ఏ ఒక్క వ్యాపారి కూడా బంగాళదుంపలను కొనడానికి రావడంలేదని స్ధానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 16 రోజులుగా ఆయిల్ ధరలు రోజురోజుకీ పెరుగుతూ పోతున్నాయి

Posted in Uncategorized

Latest Updates