ఆయుధాలు సరెండర్ చేయండి.. పోలీసుల నోటీసులు

హైదరాబాద్ :  రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో… పోలీస్ అధికారులు నిబంధనల అమలుకు కసరత్తును వేగవంతం చేశారు. ఎన్నికల నియమ, నిబంధనల గురించి అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పటికే పంపించారు. ప్రభుత్వ అధికారులతో కలిసి ఊరూరా ఎన్నికల నిబంధనలపై ప్రచారం చేస్తున్నారు. కోడ్ ను పాటించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఎన్నికల కోడ్ ప్రకారం… రాజకీయ నాయకులైనా… సామాన్య ప్రజానీకమైన.. ఆయుధాలను కలిగి ఉండటం నేరం. లైసెన్స్ డ్ , పర్మిటెడ్ ఆయుధాలు కలిగి ఉన్నవారు.. తమ తమ వెపన్స్ ను స్థానిక పోలీస్ స్టేషన్లలో అప్పజెప్పాలని పోలీస్ శాఖ నోటీసులు జారీచేసింది. బుధవారం వరకు పదివేల మందికి నోటీసులు పంపించింది. ఎన్నికల కోడ్ అయ్యాక మళ్లీ తీసుకోవచ్చని… ఆయుధాలను సరెండర్ చేయాలని వారికి నోటీసులో సూచించింది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నా… లైసెన్స్ లేని ఆయుధాలు తమ వద్ద ఉంచుకున్నా… అది నేరం అవుతుందని పోలీసులు అన్నారు. అలాంటి వారికి కఠినమైన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

Posted in Uncategorized

Latest Updates