ఆయుష్మాన్ భారత్ : గిరిజన మహిళకు చెప్పులు తొడిగిన మోడీ

modifootwearఓ గిరిజన మహిళ కాళ్లకు చెప్పులు తొడిగారు ప్రధాని నరేంద్ర మోడీ. చత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పర్యటనలో ఉన్న మోడీ.. చరణ్ పాదుకా (పాదరక్షలు) పథకాన్ని ప్రారంభించారు. కొన్ని చెప్పులను మహిళలకు అందజేశారు.

ఈ సమయంలో ఓ గిరిజన మహిళకు పాదరక్షలు అందిస్తూ.. ఆమె కాళ్లకు తొడిగారు. ఆ సమయంలో సభ చప్పట్లతో మార్మోగింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద తొలి వెల్‌నెస్ సెంటర్ నిర్మాణానికి, అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేశారు.

Posted in Uncategorized

Latest Updates