ఆరంభం అదిరింది : పాక్ ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత హాకీ జట్టు

BARAన్యూజిలాండ్ వేదికగా  రబోబ్యాంక్ మెన్స్ హాకీ చాంఫియన్స్ ట్రోఫీ 2018లో భాగంగా శనివారం భారత్-పాకిస్ధాన్ ల మధ్య జరిగిన పురుషుల హాకీ మ్యాచ్ లో పాక్ ను  చిత్తుచిత్తుగా ఓడించింది భారత్. 4-0 గోల్స్‌ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ పై ఘనవిజయం సాధించింది. గోల్స్‌ మీద గోల్స్‌ చేస్తూ పాక్‌ను ముప్పుతిప్పలు పెట్టింది భారత జట్టు. భారత జట్టు విజయంపై చీఫ్‌ కోచ్‌ హరేంద్ర సింగ్‌ సంతోషం వ్యక్తం చేశారు.  ప్రపంచంలోనే బెస్ట్  ఆరు టీమ్ లు బరిలో దిగే ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ లోనే గెలిచి భారత ఆటగాళ్లు సత్తా చూపించారన్నారు. ర్యాంకింగ్స్‌ పరంగా చూస్తే పాకిస్తాన్‌ (13) కంటే బెటర్ గా భారత్‌ (6) అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకుంది. మరోవైపు భారత హాకీ జట్టు విజయంతో క్రీడాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కచ్చితంగా ట్రోఫీ విజేత భారత్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates