ఆరు దేశాల్లో తెలంగాణ మహిళల సాహసయాత్ర

CYCLWతెలంగాణ మహిళలు చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే తొలిసారిగా నలుగురు మహిళలు ఆరు దేశాల్లో పర్యటించి, 400 ఏళ్ల తెలంగాణ చరిత్రను ప్రచారం చేసి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటకం, సంస్కృతి, సంప్రదాయాలను పలు దేశాల్లో ప్రచారం చేసేందుకు టూ వీలర్స్ పై వెళ్లిన నలుగురు సాహస మహిళలు ఆదివారం (ఏప్రిల్-) హైదరాబాద్ చేరుకున్నారు. ఫిబ్రవరి 11న బేగంపేటలోని పర్యాటక భవన్‌లో బయల్దేరిన వీరు.. ఆరు దేశాల్లో 17వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ సాహసయాత్ర జరిగింది. టూర్ పూర్తిచేసుకున్న జై భారతి, ASD శాంతి, పియా బహద్దూర్‌, శిల్పా బాలక్రిష్ణన్‌ లకు ఆదివారం సాయంత్రం పర్యాటక భవన్‌ వద్ద అధికారులు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వారు సాహసయాత్ర విశేషాలను వివరించారు. సాధారణ మహిళలమైన తమకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప బాధ్యతనిచ్చి విదేశాలకు పంపిందంటూ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రయాణంలో వినియోగించిన బజాజ్‌ డామిని 400CC బైక్స్ ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. తాము 8 వేల 500 కిలోమీటర్లు ఇండియాలో .. 8వేల 500 కిలోమీటర్లు మయన్మార్‌, థాయిలాండ్‌, లావోస్‌, వియత్నాం, కాంబోడియా దేశాల్లో మొత్తం 17 వేల కిలీమీటర్లు పర్యటించినట్లు వివరించారు. టూర్ లో భాగంగా ఢిల్లీలో ప్రధాని మోడీని కలువగా ఆయన అభినందనలు తెలిపారని వివరించారు సాహస మహిళలు.

Posted in Uncategorized

Latest Updates