ఆరు నెలల్లో ముగ్గురు బలి : ఇంజినీరింగ్ స్టూడెంట్ ప్రాణం తీసిన పోలీస్ సైరన్

karimnagar-policeపోలీస్ అంటే ఫ్రెండ్లీ అని.. వాళ్లు మనుషులే అనే సంగతి ప్రజలు బాగా గుర్తుంచుకోవాలని పదేపదే కోరుతున్నారు ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు. అయితే అందుకు విరుద్ధమైన భావన ప్రజల్లో ఉందన్న సంగతి.. ఈ ఘటనలతో మరోసారి నిరూపితం అయ్యింది. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం మొగ్దుంపూర్ శివార్లలో జరిగిన ఘటన సంచలనం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ శివార్ల వైన్ షాపు ఉంది. షాపు పక్కన పొలాల్లో కూర్చుని ఇంజినీరింగ్ స్టూడెంట్స్ పార్టీ చేసుకుంటున్నారు. వీరు నిగమా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. మొగ్దుంపూర్ లోని హాస్టల్ లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి శ్రావణ్ కుమార్ అనే స్టూడెంట్ పార్టీ చేసుకుంటున్నారు. రాత్రి 10 గంటల సమయంలో ఈ రూట్ లో వెళుతున్న పెట్రోలింగ్ వెహికల్.. సైరన్ మోగించింది. అంతే ఒక్కసారిగా స్టూడెంట్స్ అందరూ భయపడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్, న్యూసెన్స్ కేసులు పెడతారనే భయంతో పొలాల్లో పరుగులు పెట్టారు విద్యార్థులు. అలా పరిగెడుతున్న సమయంలోనే.. శ్రావణ్ కుమార్ వ్యవసాయ బావిలో పడ్డాడు. ప్రాణాలు కోల్పోయాడు. ఈ స్టూడెంట్ స్వస్థలం మంచిర్యాల జిల్లా రామకృష్ణా పూర్. చేతికొచ్చిన కుమారుడు ఇలా చనిపోవటంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆరు నెలల్లో ఇదే తరహాలో మూడు ఘటనలు :

కరీంనగర్ జిల్లా రూరల్ మండలం పరిధిలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇవాల్టి ఇన్సిడెంట్స్ ఆరు నెలల్లో మూడు జరగటం చర్చనీయాంశం అయ్యింది. కొన్ని నెలల క్రితం కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ గ్రామంలో ఓ వివాహహానికి హాజరయ్యాడు గంధం రాజు. బంధువులు, స్నేహితులతో వ్యవసాయ పొలాల్లో పార్టీకి హాజరయ్యాడు. రాత్రి సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం తిరుగుతూ సైరన్ మోగించింది. మందు తాగితే పట్టుకెళ్లి జైల్లో పెడతారనే భయంతో.. పొలాల్లో పరుగులు తీశాడు రాజు. దారిలో ఓ వ్యవసాయ బావిలో పడ్డాడు. ప్రాణాలు కోల్పోయాడు.

ఇలాంటి ఘటనే ఏప్రిల్ 27వ తేదీన కొత్తపల్లి మండలం కేంద్రం శివార్లలోనూ జరిగింది. రోడ్డు పక్కన పొలంలో మందు కొడుతున్నాడు బండారి శ్రీనివాస్. ఇంతలో బ్లూకోట్స్ పోలీసులు సైరన్ మోగిస్తూ వచ్చారు. భయంతో పరుగులు తీశాడు. బావిలో పడి చనిపోయాడు. ఆరు నెలల్లోనే కరీంనగర్ జిల్లాలో మూడు ఘటనలు జరగటం కలకలం రేపుతోంది.

 

Posted in Uncategorized

Latest Updates