ఆరు నెలల్లో 500 మిలియన్ డౌన్ లోడ్స్

 ఆరు నెలల్లో ‘డుయో’ యాప్ 500 మిలియన్ డైన్లోడ్ లు అయినట్లు గూగుల్ తెలిపింది. ఈ యాప్ 2016 లో విడుదలై… వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కేవలం 500 మిలియన్ డౌన్ లోడ్ లు మాత్రమే జరిగాయి. గత ఆరు నెలలుగా రికార్డుస్థాయి డౌన్ లోడ్ లు జరిగి.. 1 బిలియన్ కు చేరుకుంది.

గూగుల్ చెందిన యాప్స్ లలో 1 బిలియన్ డౌన్ లోడ్స్ ఐన వాటిలో ‘డుయో’ కూడా చేరింది. ఇందులో…  జీమేయిల్, మ్యాప్స్, యూ ట్యూబ్, గూగుల్ ప్లెస్, గూగుల్, గూగుల్ టెక్ట్స్ టు స్పీచ్, గూగుల్ ప్లే బుక్స్, హ్యాంగౌట్స్, గూగుల్ క్రోమ్, గూగుల్ ప్లే గేమ్స్, ఆండ్రాయిడ్ ఆక్సెసిబిలిటీ సూట్, గూగుల్ ప్లే మ్యూజిక్, గూగుల్ న్యూస్, గూగుల్ ప్లే మూవీస్ & టీవీ, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్, గూగుల్ స్ట్రీట్ వ్యూ ఉన్నాయి.

2018 లో ‘డుయో స్మార్ట్’ ను గూగుల్ లాంచ్ చేసింది. ఇది.. ఐ పాడ్, ఆండ్రాయిడ్ టాబ్లెట్, క్రోమ్ బుక్ తో పాటు స్మార్ట్ డిస్ల్పెకు సపోర్ట్ చేస్తుంది. మెసేజ్ మరియు వీడియో కాలింగ్స్ చేయడానికి ‘డుయో స్మార్ట్’ ను తయారుచేశారు.

Posted in Uncategorized

Latest Updates