ఆరు రోజుల పాటు ఫతేనగర్ ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : ఫతేనగర్ ఫ్లై ఓవర్ ని రెండు దఫాలు.. ఆరు రోజులపాటు మూసేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. బ్రిడ్జిని బాగుచేసే పనుల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు.  ట్రాఫిక్ ఆంక్షలు ఈ విధంగా ఉన్నాయి.

వివరాలు :
14వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 16వ తేదీ రాత్రి 11 గంటల వరకు.. సనత్‌నగర్ నుంచి ఫతేనగర్ బ్రిడ్జి వైపు వచ్చే వాహనాలను ప్లై ఓవర్ కింద బల్కంపేట్ వైపు మళ్లిస్తారు.

ఇక 21వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 23వ తేదీ రాత్రి 11 వరకు..  ఫతేనగర్  ప్లై ఓవర్‌ను మధ్య వరకు మూసివేసి.. బల్కంపేట్ నుంచి సనత్‌నగర్ వైపు మాత్రమే అనుమతిస్తారు.  వాహనదారులు ఈ విషయాలపై శ్రద్దవహించి సురక్షితంగా ప్రయాణించాలని అధికారులు కోరారు.

Posted in Uncategorized

Latest Updates