ఆరోగ్యమే మహా భాగ్యం….కైనీపై బ్యాన్ కు రెడీ

BANలిక్కర్ బ్యాన్ చేసిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు కైనీపై బ్యాన్ విధించేందుకు రెడీ అయ్యింది బీహార్ ప్రభుత్వం. నోటి కాన్సర్ కు ప్రధాన కారణమైన కైనీని బ్యాన్ చేయాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖను రాసింది. కైనీని పుడ్ ప్రొడక్ట్ గా గుర్తించాలని ఆ లేఖలో కోరింది. పుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) కైనీని పుడ్ ప్రొడక్ట్ గా గుర్తిస్తే బీహార్ ప్రభుత్వానికి కైనీని బ్యాన్ చేసే అవకాశముంటుంది. బీహార్ లో ప్రతి 5మందిలో ఒకరు కైనీ తీసుకుంటున్నారని, దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు గురౌతున్నారని, ఎక్కువగా నోటి కాన్సర్ కు గురౌతున్నారని, గత ఏడేళ్లలో సిగరెట్లు తాగ్రేవారి సంఖ్య తగ్గినప్పటికీ, కైనీ తీసుకునేవారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉందని, ఇది ఆందోళన కలిగించే విషయమని బీహార్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates