ఆరోగ్యమైన జీవితాన్ని అందించేందుకే ఆయుష్మాన్ భారత్ యోజన : మోడీ

madaదేశ ప్రజలకు మంచి వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పటికే రాష్ట్రాలలో ఎయిమ్స్, ఆయుర్వేద విజ్ఞాన సంస్థలు ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 90కి పైగా మెడికల్ కాలేజీలు ప్రారభించామని.. వీటితో 15 వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయని చెప్పారు. దేశ ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవితాన్నిఅందించేందుకు ఆయుష్మాన్ భారత్ యోజన ప్రారంభిస్తున్నామన్నారు. దీనిద్వారా 10 లక్షల కుటుంబాలకు.. 50 కోట్ల మంది ప్రజలకు.. 5లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కలుగుతుందన్నారు. హెల్త్ ఇండియాని క్రియేట్ చేయడంలో స్వచ్చ భారత్ ప్రధాన పాత్ర పోషిస్తుందని మోడీ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates