ఆరోగ్య పరిరక్షణలో…145వ స్థానంలో ఇండియా

indi-MMAP-md ఆరోగ్య పరిరక్షణలో ఇండియా బాగా వెనుకబడి ఉంది. ‘ప్రపంచ వ్యాప్తంగా వ్యాధుల సమస్య ’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల్లో సర్వే జరిగితే భారత్‌ 145వ స్థానంలో నిలిచింది.భారత్‌లో గోవా, కేరళ ఆరోగ్య పరిరక్షణ విషయంలో ముందుండగా.. అసోం, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు చివరి స్థానాల్లో ఉన్నాయి. క్షయ, గుండెజబ్బులు, టెస్టిక్యూలర్‌ క్యాన్సర్‌, పెద్దపేగు క్యాన్సర్‌, తీవ్రమైన మూత్రపిండ వ్యాధులను అరికట్టడంలో భారత్‌ బాగా వెనుకపడి ఉందని ఆ సర్వే పేర్కొంది.

మనకంటే మందు చైనా(48), శ్రీలంక(71), బంగ్లాదేశ్‌(133), భూటాన్‌(134)ఉండగా, నేపాల్‌(149), పాకిస్థాన్‌(154), అఫ్గానిస్థాన్‌ (191) వెనుక ఉన్నాయి. ఇక టాప్‌-5 స్థానాల్లో ఐస్‌లాండ్‌, నార్వే, నెదర్లాండ్స్‌, లక్సంబర్గ్‌, ఫిన్లాండ్‌  ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates