ఆరోగ్య సర్వే : ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తారు

hitవ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్ మెంట్ అందించడం కన్నా ముందుగానే వ్యాధిని కనుగొని, ఆదిలోనే ట్రీట్ మెంట్ అందించడంపై దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా సమగ్ర వైద్య పరీక్షల పధకానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటి సర్వే ద్వారా ఆరోగ్య సమాచారాన్ని సేకరించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తులు ప్రారంభించింది. పల్లెలు, బస్తీలలో కూడా వైద్య శిబిరాలు నిర్వహించి ప్రాధమిక వైద్య పరీక్షలు సిర్శహించి ఎవరికైనా వ్యాధి నిర్ధారణ జరిగి ఎక్కువ పరీక్షలు అవసరమైతే వారిని గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి వారికి అన్నీ పరీక్షలను ఉచితంగానే చేస్తారు. ముందుగా వ్యాధిని గుర్తించడం ద్వారా ట్రీట్ మెంట్ సులభమవుతుందని, పేదలు కూడా తమ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర వైద్య పరీక్షల పధకానికి రూపకల్పన చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఏప్రిల్ లో కెనడా, యూకే పర్యటన తర్వాత ప్రణాలికలను రూపొందించి ఆగస్టులోపు రాష్ట్రవ్యాప్తంగా అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates