ఆరోసారి…ఆసియా కప్‌ గెల్చుకున్న టీమిండియా కుర్రాళ్లు

ఆసియా కప్‌ లో భారత కుర్రాళ్లు అదరగొట్టారు. సీనియర్ల అడుగుజాడల్లో నడుస్తూనే ఈసారి అండర్‌-19 ఆసియా కప్‌ లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీలంకను 144 పరుగుల తేడా తో చిత్తుగా ఓడించారు. దీంతో ఆరోసారి చాంపియన్‌ గా నిలిచింది భారత్. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 3 వికెట్లకు 304 పరుగులు చేసింది. 305 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంక జట్టు 38.4 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది.
ఇప్పటిదాకా ఏడుసార్లు జరిగిన ఆసియాకప్ లో గతేడాది మాత్రమే భారత్‌ లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. ఈసారి మాత్రం ఆడిన ఐదు మ్యాచ్‌ ల్లో ఒక్క బంగ్లాదేశ్‌ తోనే గట్టిపోటీ ఎదురైనా మిగతా మ్యాచ్‌ ల్లో భారీ ఆధిక్యాలతో గెలుపొందింది.

Posted in Uncategorized

Latest Updates