ఆర్చరీ ప్రపంచకప్ లో సత్తా చాటిన జ్యోతి సురేఖ

ARCHఆర్చరీ ప్రపంచకప్ లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటింది. మహిళల టీమ్  విభాగంలో రజతం గెలుచుకున్న ఆమె.. మిక్స్ డ్  విభాగంలో కాంస్యం సాధించింది. మహిళల టీమ్ విభాగం ఫైనల్లో సురేఖ, ముస్కాన్, దివ్య దయాళ్ల భారత జట్టు.. చైనీస్ తైపీ చేతిలో ఓడింది. తొలి రెండు రౌండ్లను చేజార్చుకున్న భారత్ ను సురేఖ, ముస్కాన్ , దివ్య తిరిగి పోటీలోకి తెచ్చారు. కానీ ఆఖర్లో తడబడటంతో ద్వితీయ స్థానంతో నిలవాల్సి వచ్చింది. మిక్స్ డ్ విభాగంలో సురేఖ, అభిషేక్ వర్మ కాంస్యం గెలిచారు.

 

Posted in Uncategorized

Latest Updates