ఆర్టీఐ పరిధిలోకి BCCI

సమాచార హక్కు చట్టం (RTI) కిందకు బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) ను తీసుకురావాలన్న సెంట్రల్‌ ఇన్‌ఫర్మేషన్‌ కమిషన్‌(CIC) ఆదేశాలను సవాలు చేయాలని BCCI నిర్ణయించింది. మంగళవారం(అక్టోబర్-2) బీసీసీఐ ఈవిషయాన్ని చెప్పింది. CIC ఈ నిర్ణయం తీసుకోవడానికి బోర్డు పాలక కమిటీ(COA) నిర్లక్ష్య వైఖరే కారణమని బీసీసీఐ ఆరోపించింది. సీఐసీ ఆదేశాలతో బీసీసీఐ ఒక జాతీయ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌(NSF) అవుతుందని.. BCCI, CIC నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ… బోర్డు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అంది. సీవోఏ వైఖరి కారణంగానే CIC  సోమవారం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. బీసీసీఐను సమాచార చట్టం కిందకు తీసుకువాలనే ఉద్దేశంతో సీవోఏ కావాలనే ఈ విషయంపై నిర్లక్ష్యా న్ని అవలంభించిందని…బీసీసీఐ సీనియర్‌ అధికారి తెలిపారు. బీసీసీఐ ఈ చట్టం పరిధి లోకి రావడానికి తగిన ఏర్పాట్లను చేసుకోవడానికి 15 రోజుల గడువును సీఐసీ ఇచ్చింది. ఆర్టీఐ కింద దరఖాస్తులను తీసుకోవడానికి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ సిబ్బందిని సంసిద్ధం చేయడానికి ఈ సమయాన్ని ఇస్తున్నామని సీఐసీ తన ఆదేశాల్లో తెలిపింది.

జూలై 10న BCCI తన వాదనను  CIC ఎదుట విన్పించడానికి అవకాశమున్నప్పటికీ బీసీసీఐ హాజరుకాలేదు. సీఐసీ షోకాజ్ నోటీసు ఇచ్చినప్పటికి బీసీసీఐ జవాబును దాఖలు చేయలేకపోయింది. మరోవైపు సీఐసీ తాజాగా బీసీసీఐను ఆర్టీఐ కిందకు చేరుస్తూ.. సోమవారం ఆదేశాలను వెలువరించింది. దీనితో తమకు హైకోర్టులో ఈ ఆదేశాలను సవాలు చేయడం మినహా మరో మార్గం లేదని.. బీసీసీఐ అధికారి చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates