ఆర్టీసీ ఉద్యోగులకు 2.9 శాతం డీఏ పెంపు

 ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కరువు భత్యాన్ని (డీఏ) 2.9 శాతం పెంచింది TSRTC యాజమాన్యం. ఈ మేరకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ కార్యాలయం నిన్న(బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. 2018 జూలై నెలకు సంబంధించిన ఈ కరువు భత్యాన్ని 2.9 శాతం పెంచడంతో 37.2 శాతానికి చేరింది. ప్రస్తుతం 34.3 శాతం కరువు భత్యం అమలులో ఉంది. పెంచిన కరువు భత్యాన్ని సెప్టెంబరు వేతనంతో కలిపి చెల్లిస్తామని స్పష్టం చేసింది యాజమాన్యం. 2013 సంవత్సరపు వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నిర్ధారించిన మూలవేతనాల ఆధారంగా పెంచిన కరువు భత్యాన్ని లెక్కగడతామని చెప్పింది యాజమాన్యం. జూలై, ఆగస్టు నెలల కరువు భత్యం విషయంలో తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామంది. పదవీ విరమణ పొందినవారికి, మరణించినవారికి సంబంధించిన కరువు భత్యాన్ని సెటిల్‌మెంట్లతో కలిపి విడుదల చేస్తామని స్పష్టం చేసింది యాజమాన్యం.

Posted in Uncategorized

Latest Updates