ఆర్టీసీ బస్సులో మంత్రి ఈటెల ప్రయాణం

eetala1వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ మండలంలో మంత్రి ఈటల రాజేందర్ కొత్తగా ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఇది నేరెళ్ల నుంచి గునిపర్తి వరకు నడవనుంది. బస్సు ప్రారంభించి అదే బస్సులో నేరెళ్ల నుంచి అంబాల గునిపర్తి గ్రామం వరకు ప్రయాణించారు ఈటల. జనాభాకు తగినట్లుగా బస్సుల సౌకర్యం లేకపోవడంతో ఎంతో కాలంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా బస్సు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. బస్సు ప్రారంభించిన మంత్రికి తమ కృతజ్ఞతలు తెలిపారు స్థానిక నాయకులు….ప్రజలు.

Posted in Uncategorized

Latest Updates