“ఆర్డరిస్తే ఇంటికే మందు”…తూచ్ : వెనక్కి తగ్గిన మహారాష్ట్ర

ఆర్డర్ ఇస్తే బీర్లు, విస్కీలు డోర్ డెలివరీ చేస్తామని మహారాష్ట్ర  ఎక్సైజ్ మంత్రి చంద్రశేఖర్ బవంకులే చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర విమర్శలు రావడంతో స్వయంగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దిగారు. ఆర్డర్ ఇస్తే ఇంటికే మద్యం లాంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోలేదని ఫడ్నవీస్ అన్నారు. ఎప్పటికీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోమని సృష్టం చేశారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులను తగ్గించడానికిగాను మద్యం డోర్ డెలివరీని బనం కులే ప్రతిపాదించిన విషయం తెలిసిందే

Posted in Uncategorized

Latest Updates