ఆర్డర్స్ బుకింగ్ : రేపు MI  మెగా సేల్స్ డే

miటీవీ రంగంలో సంచలనం. ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని విధంగా భారీ టెలివిజన్ ను అత్యంత తక్కువ ధరతో మార్కెట్ రిలీజ్ చేస్తోంది షియోమీ. 55 ఇంచ్ LED టీవీలతోపాటు రెడ్ మీ నోట్ 5ప్రో, నోట్ 5 ఫోన్లను మెగా సేల్స్ గా ప్రారంభిస్తోంది. ఫిబ్రవరి 22వ తేదీ గురువారం MI, ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా అమ్మకాలు ప్రారంభిస్తోంది కంపెనీ. మధ్యాహ్నం 2 గంటలకు టీవీ సేల్స్ ప్రారంభం అవుతుండగా.. నోట్ 5 ప్రో మధ్యాహ్నం 12 గంటలకు సేల్స్ ప్రారంభం అవుతుంది.

కొత్త వెర్షన్ ఫోన్ల సంగతి ఎలా ఉన్నా.. MI టీవీల విషయంలో మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 55 ఇంచ్ తోపాటు ఆప్షన్ బాగున్నాయని టాక్ వచ్చింది. ప్రస్తుతం మార్కెట్ లో ఈ తరహా టీవీ కొనుగోలు చేయాలంటే కనీసం 50వేల వరకు ఉంది. ప్రపంచంలోనే సన్నగా ఉండటం దీని ప్రత్యేకత. మార్కెట్ లో ఇతర టీవీలతో పోల్చుకుంటే 10వేల తక్కువగా వస్తుండటంతో.. ఈ సేల్స్ పై మార్కెట్ వర్గాలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. పబ్లిక్ రెస్పాన్స్ ను బట్టి మిగతా కంపెనీలు కూడా ధరలు తగ్గించే అవకాశం లేకపోలేదు.

Posted in Uncategorized

Latest Updates