ఆర్మీమేజర్ భార్య హత్య : 6 నెలల్లో 3వేల 500 ఫోన్ కాల్స్

sailuసహ ఉద్యోగి భార్యను హత్య చేసిన కేసులో అరెస్ట్ అయిన ఆర్మీ మేజర్ నిఖిల్ హండా పోలీసుల విచారణలో సంచలన విషయాలను బయటపెట్టాడు. ఆర్మీ మేజర్ అమిత్‌ ద్వివేది భార్య శైలజ ద్వివేది(35)ని హత్య చేసిన కేసులో ఆదివారం (జూన్-24) ఆర్మీ మేజర్ నిఖిల్ హండాను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం కొనసాగించేందుకు శైలజ నిరాకరించడంతోనే హత్య చేసినట్లు నిఖిల్ విచారణలో బయటపెట్టాడు. 2018, జనవరి నుంచి శైలజకు 3,500 ఫోన్ కాల్స్ చేశానని.. వందల సంఖ్యలో మెసేజ్ లు చేసినట్లు పోలీసుల విచారణలో నిఖిల్ అంగీకరించాడు.

నాగాలాండ్ లో పనిచేస్తున్న సమయంలో ఆర్మీ మేజర్ అమిత్ భార్య శైలజతో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి తమ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగినట్లు విచారణలో నిఖిల్ అంగీకరించాడు. శైలజతో రోజూ వీడియోకాల్స్ మాట్లాడేవాడినని, దీన్ని ఆమె భర్త గమనించి శైలజకు వార్నింగ్ ఇచ్చాడని తెలిపాడు. కొన్నిరోజుల తర్వాత అమిత్ తన భార్య శైలజతో ఢిల్లీ వెళ్లిపోయాడని వివరించాడు. అప్పటి నుంచి శైలజ తనతో మాట్లాడటం లేదని నిఖిల్ తెలిపాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఢిల్లీ వచ్చి  శైలజను కలిసి.. తనను పెళ్లి చేసుకోవాలని కోరినట్లు తెలిపాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెను హత్య చేసినట్లు పోలీసు విచారణలో నిఖిల్ తెలిపాడు. ఢిల్లీలోని కంటోన్మెంట్‌ ఏరియాలో శనివారం శైలజ శవాన్ని పోలీసులు గుర్తించారు.

Posted in Uncategorized

Latest Updates