ఆర్మీ మేజర్ భార్య హత్య…చంపింది మరో మేజర్

majar1తోటి ఉద్యోగి భార్యపై మనసు పారేసుకున్న ఓ వ్యక్తి.. ఆమె ఒప్పుకోకపోయేసరికి కత్తితో కడతేర్చాడు. అయితే అతడు ఆర్మీలో మేజర్ కావడం.. చనిపోయిన మహిళ భర్త కూడా అదే స్థాయి అధికారి కావడం ఇక్కడ అసలు విషయం. పెళ్లికి నిరాకరించడంతో ఆమెను ఫాలో అయ్యి మరీ హత్య చేశాడు ఆ అధికారి. ఆఖరికి పోలీసుల చేతికి చిక్కాడు.

ఢిల్లీలో ఆర్మీ మేజర్ భార్య శైలజా త్రివేది హత్య కేసులో.. మరో మేజర్ నిఖిల్ హందాను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం(జూన్-23) ఉదయం ఫిజియోథెరపీ చేయించుకునేందుకు వెళ్లిన త్రివేది.. హత్యకు గురయ్యారు. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో రోడ్డుపై ఆమె శవమై కనిపించారు. మొదట రోడ్డు ప్రమాదమే అనుకున్నా.. మెడ కోసినట్టుగా గాటు ఉండటంతో హత్య అని పోలీసులు కన్ఫామ్ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఎంక్వైరీ చేసిన పోలీసులు.. మేజర్ నిఖిల్ హుందానే హంతకుడని తేల్చారు. పెళ్లికి నిరాకరించడంతోనే హత్య చేసినట్లు తేల్చారు. పరారీలో ఉన్న అతడిని యూపీలోని మీరట్ లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు.

శనివారం రోజు ఉదయం ఫిజియోథెరపీ కోసం ఆస్పత్రికి వెళ్లిన శైలజను నిఖిల్ ఫాలో అయ్యాడు. ఆస్పత్రి బయట ఆమె అతడి కారులోకి ఎక్కంది. తనను పెళ్లి చేసుకోవాలని నిఖిల్ ఆమెను అడిగాడు. ఆమె నో చెప్పడంతో.. కారులోనే గొంతుకోసి బయటకు తోసేశాడు. మర్డర్ ను యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు కారును ఆమె పై నుంచి పోనిచ్చాడు.

మృతురాలికి, నిఖిల్ హందాకు గతంలోనే పరిచయం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. 2015 నుంచి వీరిద్దరికి పరిచయం ఉందని అధికారులు చెబుతున్నారు. నిఖిల్ హందా, శైలజా త్రివేది భర్త 2015 లో నాగాలాండ్ లో పనిచేశారు. అక్కడే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత శైలజ భర్తకు ఢిల్లీకి ట్రాన్స్ ఫర్ అయ్యింది. అయినా ఇద్దరు ఫోన్ లో కాంటాక్ట్ లో ఉండేవారని పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. ఓ సారి వీడియో కాల్ మాట్లాడుతుండగా శైలజ… తన భర్తకు దొరికిపోయిందట. దీంతో ఆయన నిఖిల్ హందాకు వార్నింగ్ ఇచ్చారు. అయినా పద్దతి మార్చుకోని హందా.. చివరకు ఆమె ప్రాణాలు తీశాడు. జైలుపాలయ్యాడు.

Posted in Uncategorized

Latest Updates