ఆర్ అండ్ బీ శాఖలో అక్రమాలకు తావు లేదు : తుమ్మల

THUMMALAతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. ఆర్ అండ్ బీ శాఖలో అక్రమాలకు తావు లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గతంలో అక్రమాలు జరిగేవన్నారు. ప్రతిభావంతులకే ఉద్యోగులు దక్కుతున్నాయని చెప్పారు. బుధవారం (జూన్-6) TSPSC ద్వారా ఆర్ అండ్ బీ శాఖలో ఎంపికైన AEE అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు మంత్రి. కొత్తగా వేల కిలోమీటర్లు రోడ్లు వేశామన్నారు. ఇంకా మారుమూల ప్రాంతాల్లో రోడ్లను విస్తరించాల్సి ఉందన్నారు. ఆర్ అండ్ బీ శాఖలో గత 30ఏళ్లలో ఖర్చు చేసిన దానికంటే.. మూడేళ్లలో డబుల్ ఖర్చు పెట్టామన్నాను మంత్రి ఏఈఈలుగా నియామక పత్రాలు అందుకున్నవారు సంతోషం వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates