ఆర్ ఆర్ నగర్ లో కాంగ్రెస్ దే విజయం

RRకర్ణాటకలోని ఆర్ ఆర్ నగర్ అసెంబ్లీ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి మునిరత్న ఘనవిజయం సాధించారు. 41 వేల162 ఓట్లతో మనిరత్న విజయం సాధించారు. రాష్ట్రంలో జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ… రెండు పార్టీలు తమ అభ్యర్ధులను రంగంలోకి దించాయి. సీఎంగా జేడీఎస్ నాయకుడు కుమారస్వామి ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్ధి అతి తక్కువ ఓట్లతో మూడో స్ధానంలో నిలిచారు. కాంగ్రెస్ విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు బెంగళూరులో సంబరాలు చేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర్ మునిరత్నకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ మెజార్టీతో ప్రజలు తమని గెలిపించారని, బెంగళూరు ప్రజలు తమను ఆశీర్వదించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ దినేష్ గుండురావ్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates