ఆలంఖాన్ మనవడితో ఒవైసీ కూతురు పెళ్లి

హైదరాబాద్ : మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూతురు పెళ్లి ఈనెల 28న జరగబోతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త నవాబ్ షా ఆలంఖాన్ మనవడు బర్కత్ ఆలంఖాన్ కు…. అసదుద్దీన్ ఒవైసీ కూతురు ఖుదాసియా ఒవైసీని ఇచ్చి పెళ్లిచేయాలని రెండు కుటుంబాలు ఇప్పటికే నిర్ణయించాయి. వివాహ సన్నాహాలతో… ఒవైసీ, ఆలంఖాన్ కుటుంబాల్లో పెళ్లి సందడి కనిపిస్తోంది.

అసదుద్దీన్ ఒవైసీది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. పలు విద్యాసంస్థల అధినేత ఆలంఖాన్. దక్కన్ సిగరెట్ ఫ్యాక్టరీతోపాటు అన్వర్ ఉలూమ్ కాలేజీ సహా.. పలు కాలేజీలు ఆలంఖాన్ యాజమాన్యంలో ఉన్నాయి. ఇటీవల అసదుద్దీన్ ఒవైసీతోపాటు ఆలంఖాన్, బర్కత్ అలీఖాన్ లు సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రాలు అందజేశారు. తమ కూతురు వివాహానికి రావాలని అసదుద్దీన్ ఒవైసీ ఆహ్వానించడంతో, తప్పకుండా వస్తానన్నారు కేసీఆర్.

 

Posted in Uncategorized

Latest Updates