ఆలయంలోకి అడుగుపెట్టిన MLA : గంగాజలంతో ఆలయం శుద్ది

అది ఒక ప్రసిద్ద దేవాలయం. ఇంతవరకూ ఒక్క మహిళ కూడా గుడిలో అడుగుపెట్టలేదు. అయితే ఓ మహిళా MLA దేవాలయం లోపలికి అడుగుపెట్టడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. టెంపుల్ ను MLA సందర్శంచడంపై ఆలయ పూజారి, స్ధానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూపీలోని హరిమ్ పూర్ లో ఈ ఘటన జరిగింది.
జులై-12, 2018న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హరిమ్ పూర్ లోని ఓ దేవాలయాన్ని బీజేపీ మహిళాMLA మనీషా అనురాగి సందర్శించారు. అయితే ఆ టెంపుల్ లో మహిళకు ప్రవేశం నిషేధం. దీంతో MLA టెంపుల్ ని సందర్శంచడంపై గ్రామస్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పూజారి మాట్లాడుతూ…. ఇప్పటివరకూ ఓ ఒక్క మహిళ కూడా టెంపుల్ లోకి అడుగుపెట్టలేదు. MLA టెంపుల్ లోకి అడుగుపెట్టిన సమయంలో తాను అక్కడ లేనని, ఒకవేల ఉండి ఉంటే ఆమెను ఆలయంలోకి రానిచ్చేవాడిని కాదని తెలిపారు. MLA ఆలయంలోకి అడుగుపెట్టడంతో ఆలయం పవిత్రత దెబ్బతిందని తెలిపారు. ఆలయం మొత్తం గంగాజలంతో శుభ్రం చేసినట్లు తెలిపారు. ఆలయంలోని దేవుళ్ల విగ్రహాలను కూడా శుద్ది కోసం అలహాబాద్ లోని త్రివేణి సంగమంకు పంపించినట్లు తెలిపారు.
అయితే దీనిపై స్పందించిన MLA మనీషా అనురాగి… ఇది ఖచ్చితంగా మహిళలను అవమానపర్చడమేనని, ఇలాంటి పనులు బుర్ర తక్కువ వాళ్లు చేసేవని అన్నారు.

Posted in Uncategorized

Latest Updates