ఆల్రెడీ పడుతున్నాయి : ఈ సారి ముందుగానే రుతుపవనాలు

monsoonనిర్ణీత గడువుకంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది దేశంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. సమ్మర్ ప్రారంభంలోనే లోనే క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించడం, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు పడటం వంటి పరిణామాలు ముందస్తు రుతుపవనాలకు దోహదం చేయనున్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి జూన్‌-1 నాటికి ఈ నైరుతి రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉందని, అయితే అంతకంటే 8 రోజుల ముందుగానే ఇవి కేరళను తాకే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి నీటి ఆవిరి కలిగిన మేఘాలు భూమధ్యరేఖ దాటి ఉత్తరార్థ గోళంలోకి ప్రవేశిస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో యాంటీ సైక్లోన్లు బలంగా ఉన్నాయి. ఇవి దక్షిణం వైపు నుంచి తేమ గాలులతో తూర్పు, పశ్చిమతీరాలకు వస్తున్నాయి.  దీని ఫలితంగానే ఈ సమ్మర్ లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలకు కారణమవుతున్నాయన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే స్కైమెట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates