ఆల్ టైం రికార్డ్ : భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు

petపెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రోజువారీ ధరల సమీక్షతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి ఆయిల్ కంపెనీలు. ప్రభుత్వం తక్షణమే ఎక్సైజ్ డూటీని తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. ఆదివారం(మే-20) హైదరాబాద్ లో 35 పైసలు పెరిగి లీటరు పెట్రోల్ ధర రూ.80.76 ఉండగా, డీజిల్ 29 పైసలు పెరిగి రూ.73.45గా ఉంది. మరోవైపు దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అయితే గరిష్ఠంగా లీటరు పెట్రోల్ ధర రూ.84.07 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.76.24 గా ఉంది. ప్రతిరోజూ ప్రయాణాలు చేసేవారికి పెరుగుతున్న ధరల వలన చాలా కష్టంగా ఉందని, వెంటనే ఆయిల్ ధరలు తగ్గేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates