ఆల్ టైం హై : రికార్డ్స్ బద్దలు కొడుతున్న డీజిల్ రేట్లు

DESవాహనదారులకు ఇప్పటికే పెట్రోలు ధరలు చుక్కలు చూపిస్తుండగా..ఇప్పుడు డీజిల్ ధరలు కూడా పెట్రోల్ బాటలోనే వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ గేర్‌ లో దూసుకుపోతున్నాయి. హైదరాబాద్‌ లో డీజిల్‌ ధర ఆల్‌ టైం రికార్డు స్థాయికి చేరుకుంది. రోజు వారీ ధరల పేరుతో పెట్రో ధరలను పైసా.. పైసా పెంచుతున్న చమురు సంస్థలు.. వినియోగదారునిపై సైలెంట్‌ గా బాదేస్తున్నాయి.

ఏప్రిల్ మొదట్లో డీజిల్‌ ధరను లీటర్‌ కు మూడు నుంచి 19 పైసల చొప్పున పెంచిన ఆయిల్‌ కంపెనీలు.. రెండు రోజుల క్రితం మూడు పైసలు తగ్గించాయి. మళ్లీ ఇప్పుడు డీజిల్‌ ధర తారస్థాయికి చేరింది. దీంతో హైదరాబాద్‌ లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.70.58కు చేరింది. ఇక లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.78.27గా ఉంది. గతేడాది వరకు ప్రతి 15 రోజులకోసారి పెట్రో ధరలు సమీక్షించిన చమురు సంస్థలు.. 2017 జూన్‌ నుంచి ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు ధరలను నిర్ణయిస్తున్నాయి. నూతన విధానం అమల్లోకి వచ్చిన ఫస్ట్ 15 రోజులూ ధరలు తగ్గగా.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates