ఆల్ ది బెస్ట్ : ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు

llll-10నేటి నుంచి బుధవారం (ఫిబ్రవరి-28) ఇంటర్ ఇంటర్మీడియట్-2017-18 వార్షిక పరీక్షలు మొదలుకానున్నాయి. మార్చి 19వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నప్పటికీ పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచి అనుమతించనున్నారు. నిమిషం ఆలస్యమైన విద్యార్థులకు పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 9,63,546 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

Posted in Uncategorized

Latest Updates