ఆల్ ది బెస్ట్ : ఇవాళ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్

తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఇవాళ(సెప్టెంబర్.30) ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. రాష్ర్ట వ్యాప్తంగా 40 నగరాలతో పాటు జిల్లా కేంద్రాల్లో 966 ఎగ్జామ్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. వివిధ విభాగాల్లో 16,925 పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న ఈ పరీక్ష‌కు సుమారు 4.5 లక్ష‌ల మంది అభ్యర్ధులు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష‌ జరుగుతుంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates