ఆల్ ది బెస్ట్ : నేటి నుంచే TRT పరీక్షలు ప్రారంభం

TRT-300x171కాసేపట్లో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ నియామక పరీక్షలు(TRT) ప్రారంభం కానున్నాయి. TSPSC ఆధ్వర్యంలో జరగనున్న ఎగ్జామ్స్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల 792 పోస్టులకు 2 లక్షల 77 వేల 574 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం 12.30 వరకు బాషా పండిట్లు, మధ్యాహ్నం రెండున్నర నుంచి 5 గంటల వరకు స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టుల ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఆన్ లైన్లో పరీక్ష నిర్వహిస్తున్నారు అధికారులు. 45 నిమిషాలకు ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు అభ్యర్థులను అనుమతిస్తున్నారు. నిమిషం ఆలస్యం చేసిన పరీక్ష రాసేందుకు అనుమతించమంటోంది TSPSC.

Posted in Uncategorized

Latest Updates