ఆవిర్భావ దినోత్సవ అవార్డులు: నేరెళ్ల వేణుమాధవ్ కు విశిష్ట సేవా పురస్కారం

awardsరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన వారికి అవార్డులు ప్రకటించింది ప్రభుత్వం.  విశిష్టసేవ విభాగంలో మిమిక్రీ కళాకారుడు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్, 1969 తెలంగాణ ఉద్యమకారుడు ఆదిరాజు వెంకటేశ్వరరావుకు అవార్డు ప్రకటించింది. సాహిత్యంలో డాక్టర్ కందుకూరి శ్రీరాములు, ఆడెపు లక్ష్మీపతి, వసంతరావు దేశ్ పాండే, ప్రొఫెసర్ మహ్మద్ అలీ అసర్ ను ఎంపిక చేసింది. శాస్త్రీయ సంగీతంలో నిహాల్, శాస్ర్తీయ నృత్యంలో డాక్టర్ పద్మజారెడ్డి, పేరిణి డ్యాన్సర్ టంగటూరి భీమన్ పటేల్, జానపదం కళాకారుడు పురాణం రమేష్, జానపద కళాకారులు గిద్ద రామనర్సయ్య, మిట్టపల్లి సురేందర్ ను రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. ఇక ఉద్యమగాయకులు వరంగల్ శ్రీనివాస్, జలజ, శంకర్ బాబు, థియేటర్ అండ్ మ్యాజిక్ విభాగంలో సామల వేణు, డాక్టర్ జి. కుమారస్వామి, క్రీడల్లో మహ్మద్ హసముద్దీన్, సిక్కిరెడ్డి, ఎన్జీవో డాక్టర్ హనుమంతరావు కూడా అవార్డులు దక్కించుకున్నారు. ఉత్తమ గ్రామ పంచాయతీగా ములుగు మండలంలోని జగ్గన్నపేట, ఉత్తమ మున్సిపాలిటీ గా నిజామాబాద్ కార్పోరేషన్, ఉత్తమ రైతుగా యానాల లక్ష్మీ, ఉత్తమ టీచర్ గా లింబన్న ఎంపికయ్యారు.

Posted in Uncategorized

Latest Updates