ఆవిర్భావ వేడుకలు: పరేడ్ గ్రౌండ్ లో పోలీసుల రిహార్సల్స్

police-reharsalsజూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంతో పాటు దేశ, అంతర్జాతీయ స్థాయిలో… తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయలను ప్రపంచానికి తెలియజేసేలా.. కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులతో పాటు మెయిన్ జంక్షన్ల దగ్గర డెకరేషన్ చేశారు.

రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా దేశంలోనే మొదటిసారిగా బైసన్ పోల్ గ్రౌండ్ లో పారా మోటరింగ్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు మంత్రి చందులాల్. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు జాయ్ రైడ్ స్కై ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన బ్రౌచర్ ను విడుదల చేశారు. సాంస్కృతిక శాఖ ద్వారా వెయ్యి మంది కళాకారులతో లుంబీని పార్క్ నుంచి. పీపుల్స్ ప్లాజా వరకు కళాజాత నిర్వహిస్తామన్నారు.

స్టేట్ ఫార్మెషన్ డే వేడుకలు జరిగే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ను తమ ఆదీనంలోకి తీసుకున్నారు పోలీసులు. గ్రౌండ్ మొత్తం తనిఖీలు చేశారు. సెలబ్రేషన్స్ కోసం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు సీపీ అంజనీ కుమార్. అక్టోపస్ దళాలతో పాటు…కేంద్ర బలగాలు…బందోబస్తులో పాల్గొంటాయన్నారు.

అన్ని జిల్లాల్లోనూ సెలబ్రేషన్స్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా… కరీంనగర్ మున్సిపల్ కార్పేరేషన్ ఆధ్వర్యంలో  5K రన్ నిర్వహించారు.

Posted in Uncategorized

Latest Updates