ఆవులకూ ఆధార్ : బడ్జెట్‌లో రూ.50 కోట్లు

Cowsదేశంలోని ప్రతి ఒక్కరికీ 12 అంకెల ఆధార్ కార్డు ఉన్నట్లుగానే ఆవులకు కూడా ఓ నంబర్‌ను (యూనిక్ ఐడెంటిఫికేషన్) కేటాయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. తొలుత ఈ ప్రతిపాదనను 2015లో తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఈసారి బడ్జెట్‌లో రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులతో మొదటిదశలో నాలుగు కోట్ల ఆవులకు నంబర్లు కేటాయిస్తారు.

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ UID టెక్నాలజీని సమకూర్చుకున్నదని డెయిరీ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం అత్యంత చవకైనదని.. ఆవుకు సంబంధించిన జాతి, వయస్సు, లింగం, ఎత్తు, శరీర గుర్తులు వంటి వివరాలతో కూడిన టాంపరింగ్‌కు అవకాశం లేని ట్యాగ్ ఉంటుందన్నారు. ఒక్కో కార్డుకు రూ.8 నుంచి రూ.10 వరకు వ్యయం అవుతుందన్నారు. పశుసంజీవిని పేరుతో చేపట్టే ఈ ప్రాజెక్టు డెయిరీ, ఫిషరీస్ రంగంలో అతిపెద్దదని వెల్లడించింది.

రైతు ఆదాయం రెట్టింపుచేసేందుకు..

2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలనే ల క్ష్యాన్ని చేరుకోవాలంటే డెయిరీ రంగం చాలా కీలకమ ని కేంద్రం భావిస్తున్నది. చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు వ్యవసాయంతోనే ఆదాయం సాధించలేరని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లతో చేపలపెంపకం, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి నిధి, పశుసంవర్ధక మౌలికవసతుల అభివృద్ధి నిధిని ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. పశుజాతుల అభివృద్ధి, కృత్రిమ గర్భధారణ, పశుఅభివృద్ధి కోసం రూ.200 కోట్లను కేటాయించారు. ప్రతిపాద నలకు అనుగుణంగా 4 కోట్ల పశువులకు ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయిస్తే పాల ఉత్పత్తి 20 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates