ఆశలు తీసేయ్.. హాయిగా బతికేయ్..

వెలుగు నెట్ వర్క్:  మనిషి జీవితం చాలా చిన్నది. ఉన్నదాంట్లో సంతోషంగా బతకాలి. కోర్కెలకు అంతు ఉండదు. ఒకటి పొందాక మరొకటి కావాలనిపిస్తుంది. అది వచ్చాక ఇంకొకటి ఉంటే బాగుండు అనిపిస్తుంది. కోర్కె మనిషిని సంతోషం నుంచే కాదు, నిజమైన బతుకు నుంచి కూడా దూరం చేస్తుంది. అయితే ఆశకు అంతు ఎలా ఉంటుంది… ఎదిగే క్రమాన్ని, ముందుకు వెళ్లే దారిని ఆపేయడమే కదా కోర్కెలను అదుపు చేస్తే అంటారు చాలామంది. కానీ ఎంత వరకు, ఎప్పటి వరకు, దేని కొరకు అనే ప్రశ్నలు వేసుకుంటే ఆశను అదుపు చేసుకోవడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

కొంతమందికి తృప్తి అనేది అసలు ఉండదు. మనవళ్లు, మునిమనవళ్లు కూర్చొని తిన్నా కరిగిపోని ఆస్తి సంపాదించినా ఇంకా కావాలనే ఆశ. ప్రపంచం మొత్తం గుర్తించే కీర్తి పొందినా ఇంకా పేరు కావాలనే ఆశ. జీవితాంతం కట్టు కున్నా మిగిలి ఉండే చీరలున్నా ఇంకా కొత్తదాని మీద మోజు, కొత్తరకం నగ మార్కెట్లోకి వస్తే అదీ కావాలన్న కోరిక. అందుకే చనిపోయే వరకు కోరికలకు అంతు ఉండదు. అందుకే ఆశలను అదుపు చేసుకునే వాళ్లే ఆనందంగా ఉంటారు. తృప్తి అనేది నిజమైన మనిషిని చేస్తుంది. మంచం ఉన్నవరకే కాళ్లు ముడుచుకోవాలన్న మన సామెత ఇలాంటి కోరికలు ఎక్కువ ఉండేవాళ్ల గురించి చెబుతుంది. ఫైనల్ గా.. మనిషి జీవితంలో ఆనందం ఉండాలంటే ఆశలు అదుపులో ఉండక తప్పదు మరి.

Posted in Uncategorized

Latest Updates