ఆషాడ మాసం బోనాలు : మట్టి కుండలకు ఫుల్ డిమాండ్

ఆషాడ మాస మొచ్చింది. పట్నంల బోనాలు జోరుగ నడుస్తున్నాయి. బోనాల్లో మట్టి పాత్రలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే గోల్కొండ, సికింద్రాబాద్ మహంకాళి, లాల్ దర్వాజా బోనాలకు మట్టి కుండలు తయారీలో వ్యాపారులు బిజీగా ఉన్నారు. అమ్మవారికి అందించే బోనం మట్టి కుండల్లోనే తీసుకెళ్తారు. దీంతో సిటీలో బోనం కుండలకు గిరాకీ పెరిగింది. అంబర్ పేట్ లోని కుమ్మరి వాడి వీధి మట్టి కుండల తయారీకి ఫేమస్.

దాంతో పండగ నెల రోజుల ముందు నుంచే ఈ బస్తీ హడావిడిగా ఉంటుంది. రకరకాలుగా కుండలు చేసి.. వాటిపై బొమ్మల పెయింటింగ్ వేసి ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు వ్యాపారులు. గతేడాదితో పోలిస్తే… ఈ ఏడాది మార్కెట్ లోకి ఇప్పటికే చాలా కుండలొచ్చాయంటున్నారు. ఒక్క కుండ 100 రూపాయలు ఉండగా గురిగి, కంచు 50 రూపాయల వరకు ఉంటోందని చెబుతున్నారు. జనం మాత్రం ఏడాదికోసారి వచ్చే పండుగకి మట్టి కుండలోనే బోనం సమర్పించాలనీ… ధర ఎక్కువైనా కొంటున్నాం అంటున్నారు.

కిందటేడాదితో పోలిస్తే ఈ సారి కొంచెం ధరలు పెరిగాయ్ అంటున్నారు. వర్షా కాలం మట్టి పాత్రలు వాడటంతో సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయంటున్నారు జనం. డిజైన్ బిందెలని వాడేకంటే.. కొత్త మట్టి కుండను తెచ్చి వాటిని శుభ్రం చేసుకొని పసుపు ,కుంకుమలతో అలంకరిస్తే  బోనంకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని అంటున్నారు మహిళలు. మట్టికుండ కొంటే అది మళ్ళీ వాడుకునే అవకాశం ఉండదనీ.. స్టీల్, రాగి బిందెలని కూడా కొందరు వాడుతున్నారని అంటున్నారు వ్యాపారులు.

Posted in Uncategorized

Latest Updates