ఆషాఢం ఆఫర్ : 10 రూపాయలకే చీర

ఆషాఢం మాసం వచ్చిందంటే ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పిస్తాయి షాపింగ్ మాల్స్. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకుని.. ఎక్కడా వినని ఆఫర్స్ ను ప్రకటిస్తాయి. ఇందులో భాగంగానే ఏ షాపింగ్ మాల్ స్పెషల్ ఆఫర్ ను ప్రకటించింది. మహిళలనే టార్గెట్ చేస్తూ చీరలను అతితక్కువ ధరకు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. వరంగల్ జిల్లా హన్మకొండలోని ఓ షాపింగ్‌మాల్‌ 10 రూపాయలకే చీర అని ప్రకటించింది. అంతే ఆడాళ్లంతా ఆ షాపింగ్ మాల్ ముందు క్యూ కట్టారు.

100 రూపాయల విలువ చేసే చీర కేవలం పది రూపాయలకే వస్తుండటంతో ఊళ్లకు ఊళ్లు దాటి పట్నం బాట పట్టారు మహిళలు. హన్మకొండ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో  తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా తరలిరావాల్సి వచ్చింది.

ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య 10 రూపాయల ఆఫర్ చీరలు అమ్మకానికి పెట్టినట్లు మాల్ ప్రకటించింది. మొదట చీరలను ఫ్రీగా ఇద్దామని అనుకున్నామని.. అయితే ఆఫర్ ప్రకటించాలనే ఉద్దేశ్యంతోనే 10 రూపాయల ధర నిర్ణయించినట్లు వివరించారు. పెద్ద సంఖ్యలో కస్టమర్స్‌ వచ్చినప్పుడు ఇతర ఐటమ్స్ కూడా కొనే అవకాశం ఉందని.. అలాగే తమ షాపింగ్ మాల్‌ గురించి అందరికీ తెలుస్తుంది అంటున్నారు ఆ షాపు యజమాని.

Posted in Uncategorized

Latest Updates