ఆసక్తికర వాదనలు : అర్థరాత్రి సుప్రీంలో కన్నడ రాజకీయం

supremeసుప్రీంకోర్టులో కాంగ్రెస్-JDSలకు ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించంది. గవర్నర్ నిర్ణయాన్ని తాము నియంత్రించలేమని స్పష్టం చేసింది. గవర్నర్ వాజుభాయి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం (మే-16)అర్థరాత్రి విచారణ జరిపింది. అందరి వాదనలు విన్న జస్టిస్ సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బోబ్డేల ధర్మాసనం… ప్రమాణస్వీకారంపై స్టే ఇవ్వలేమని… తేల్చిచెప్పింది. మూడున్నర గంటలకుపైగా వాదనలు జరగగా… కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. అయితే పిటిషన్ ను మాత్రం డిస్మిస్ చేయలేదు. గురువారం (మే-17) ఉదయం పదిన్నర గంటలకు మళ్లీ విచారిస్తామని తెలిపింది.

బీజేపీకి మెజారిటీ లేకపోయినా… యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వాజుభాయి వాలా ఆహ్వానించడానికి వ్యతిరేకంగా… H.D.కుమారస్వామి, కర్ణాటక పీసీసీ చీఫ్ జి.పరమేశ్వరలు పిటిషన్ వేశారు. అర్జెంట్ హియరింగ్ కింద అర్థరాత్రి వాదనలకు అనుమతించాలని కోరారు. దీంతో మ్యాటర్ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఇంటికి చేరింది. అత్యవసర విచారణకు చీఫ్ జస్టిస్ అనుమతిచ్చారు. జస్టిస్ A.K.సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ S.A.బోబ్డేలు అర్థరాత్రి 2గంటల 10 నిమిషాలకు కోర్ట్ నంబర్ 6లో నిమిషాలకు విచారణ జరిపారు. పిటిషనర్ల తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్, ఇద్దరు అడిషనల్ సొలిసిటర్ జనరల్స్ తుషార్ మెహతా, మణిదీప్ సింగ్ లు కోర్టుకు హాజరయ్యారు. బీజేపీ తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రొహత్గీ వచ్చారు.

వాదన మొదలుపెట్టిన అభిషేక్ మను సింఘ్వీ… కాంగ్రెస్-JDS కూటమికి 117మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని… బీజేపీకి 104 మంది మాత్రమే ఉన్నారన్నారు. ఈ దశలో కలుగజేసుకున్న ముకుల్ రోహత్గీ… గవర్నర్ నిర్ణయాలపై ఎలాంటి ఇంజంక్షన్ ఇవ్వడం కుదరదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 అందుకు అనుమతించదన్నారు. తిరిగి వాదనలు వినిపించిన సింఘ్వీ… మే 15న మద్యాహ్నం 3గంటలకు JDSకు సపోర్ట్ చేస్తున్నట్టు పీసీసీ చీఫ్ గవర్నర్ కు లెటర్ రాశారని, కాంగ్రెస్ మద్దతును కుమారస్వామి అంగీకరించారని కోర్టుకు తెలిపారు. 16న ఉదయం 10గంటలకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ JDSకు మద్దతు ఇస్తూ తీర్మానం పాస్ చేసిందన్నారు. సాయంత్రం ఐదున్నర గంటలకు MLAల సంతకాలతో కూడిన లెటర్ ను గవర్నర్ కు కుమారస్వామి సమర్పించారన్నారు. కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లెటర్ ను గవర్నర్ కు పంపించిందన్నారు. రాత్రి 9గంటలకు యెడ్యూరప్పకు గవర్నర్ ఇన్విటేషన్ పంపారని… అయితే రూల్స్ ప్రకారం క్లియర్ మెజారిటీ ఉన్న వ్యక్తిని మొదట అనుమతించాలన్నారు. గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన కాంగ్రెస్ ను కాకుండా BJP పోస్ట్ పోల్ అలయన్స్ ను ఆహ్వానించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన విషయం గుర్తు చేశారు. బొమ్మయి, రామేశ్వర్ ప్రసాద్ తీర్పులను సింఘ్వీ గుర్తు చేశారు. యడ్యూరప్ప తనను తాను క్లెయిమ్ చేసుకున్నారని… కుమారస్వామికి మెజారిటీ ఉందన్నారు. యెడ్యూరప్పకు మెజారిటీ లేదని మీరెలా చెప్పగలరని సింఘ్వీని జడ్జీలు ప్రశ్నించారు. అది తెలుసుకోవడానికి కనీసం రెండు రోజులైనా ప్రమాణస్వీకార కార్యక్రమం ఆపాలన్నారు సింఘ్వీ.

సింఘ్వీ తర్వాత అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ వాదన ప్రారంభించారు. గవర్నర్-బీజేపీ మధ్య జరిగిన చర్యలేంటో మనకు తెలియదని… యడ్యూరప్పకు ఇతర పార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండిఉండొచ్చన్నారు. కాంగ్రెస్-JDS కూటమి తమకు 117మంది ఎమ్మెల్యేల బలం ఉందని చూపిస్తుండగా… బీజేపీకి 112 మంది ఎలా ఉంటారని ప్రశ్నించారు జస్టిస్ సిక్రీ. అయితే కాంగ్రెస్ గవర్నర్ కు ఇచ్చిన ఎమ్మెల్యేల సంతకాల్లో ఏది కరెక్టో ఏది కాదో తెలియదన్నారు అటార్నీ జనరల్ వేణుగోపాల్. గవర్నర్ ఏ బేసిస్ లో డెసిషన్ తీసుకున్నారో తెలియదని… అవన్నీ సుప్రీం ముందు సబ్మిట్ చేయాల్సి ఉందన్నారు. వాదన ప్రారంభించిన ముకుల్ రోహత్గీ పిటిషన్ ను డిస్మిస్ చేయాలన్నారు. రాజ్యాంగాన్ని డైల్యూట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. గవర్నర్ ను కోర్టుకు పిలవలేమని..నోటీసులు ఇవ్వలేమని, అఫిడవిట్ ఫైల్ చేయమని అడగలేమన్నారు రోహత్గీ. అవసరమైతే సీఎం పదవి నుంచి యెడ్యూరప్పను తర్వాత తొలగించవచ్చని… కానీ గవర్నర్ ను ప్రశ్నించే అధికారం మాత్రం సుప్రీంకు లేదన్నారు.

Posted in Uncategorized

Latest Updates