ఆసియాకప్: ఇవాళ భారత్, పాకిస్తాన్ మధ్య సమరం

డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగి అదరగొడుతున్నటీమిండియా ఆసియా కప్ లో మరోసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీ కొట్టేందుకు రెడీ అయ్యింది. సూపర్‌–4లో భాగంగా ఇవాళ (ఆదివారం ) దాయాదుల సమరం జరుగనుంది.

రోహిత్‌ సేన ఉరిమే ఉత్సాహంతో ఉంది. ఎవరెదురైనా ఓడించేందుకు సిద్ధంగా ఉంది. అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. రోహిత్‌ టీంకు ఆరంభంలో ఒక్క హాంకాంగ్‌ మినహా ఏ జట్టూ కనీసం ఎదురునిలువ లేకపోయింది. భారత బౌలింగ్‌తో పోలిస్తే పాక్‌ పేస్‌ దళం అంత పటిష్టంగా ఏమీ లేదు. ఇలాంటి నిలకడలేని బ్యాటింగ్, బౌలింగ్‌తో భారత్‌ను ఓడించాలంటే పాకిస్తాన్‌ శక్తికి మించి పోరాడాల్సి ఉంటుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

Posted in Uncategorized

Latest Updates