ఆసియాకప్: ధోనీ కెప్టెన్సీలో టీమిండియా.. ఆప్ఘనిస్థాన్ బ్యాటింగ్

దుబాయ్ : ఆసియా కప్ లో ఫైనల్ బెర్త్ ను దాదాపుగా ఖాయం చేసుకున్న టీమ్ ఇండియా ఇవాళ మరో ఇంట్రస్టింగ్ ఫైట్ చేయబోతోంది. సూపర్ ఫోర్ రౌండ్ లో ఆఫ్ఘనిస్థాన్ తో మూడో మ్యాచ్ ఆడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచిన ఆప్ఘనిస్థాన్ టీమ్ బ్యాటింగ్ తీసుకుంది. భారత జట్టు బౌలింగ్ చేస్తోంది.

ఈ మ్యాచ్ కోసం టీమిండియా జట్టులో భారీ మార్పులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకున్నాడు. టెంపరరీ కెప్టెన్సీని మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి అప్పగించాడు. శిఖర్ ధావన్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్ లకు రెస్ట్ ఇచ్చారు. మనీష్ పాండే, చాహర్, శార్దూల్ కౌల్, కేకే అహ్మద్ లు జట్టులో చేరారు.

సూపర్ ఫోర్ లో మొదటి మ్యాచ్ లో బంగ్లాను ఓడించిన భారత్.. రెండో మ్యాచ్ లో పాకిస్థాన్ ను చిత్తుచేసింది. మూడో మ్యాచ్ లో ఆప్ఘనిస్థాన్ తో ఆడుతోంది. ఆప్ఘన్ టీమ్ బౌలింగ్ , బ్యాటింగ్ రంగాల్లో స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. రషీద్ ఖాన్ లాంటి క్వాలిటీ స్పిన్నర్ ఆ జట్టు ప్రధాన అస్త్రం. టీమిండియా మిడిలార్డర్ రషీద్ ఖాన్ ను ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Posted in Uncategorized

Latest Updates