ఆసియాకప్ మనదే : బంగ్లాపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

ఆసియా కప్‌ అద్భుతంగా ముగిసింది. అత్యంత ఉత్కంఠభరితంగా ఆఖరి బంతి వరకు సాగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్‌ దే పైచేయి అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తీవ్రంగా శమ్రించాల్సి వచ్చింది. చివరి వరకు పట్టుదలగా ఆడి పోరాడిన బంగ్లాదేశ్‌ కు మరోసారి నిరాశ తప్పలేదు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని.. టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్‌ సగర్వంగా ఏడోసారి ఆసియా కప్‌ ను అందుకోగా…మొర్తజా టీమ్ వరుసగా మూడోసారి రన్నరప్‌ గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. దుబాయ్ వేదికగా  శుక్రవారం (సెప్టెంబర్-28) జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌ 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ కు దిగిన బంగ్లాదేశ్‌ 48.3 ఓవర్లలో 222 రన్స్ కు ఆలౌటైంది. లిటన్‌ దాస్‌ (117) కెరీర్‌లో ఫస్ట్ సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో కుల్దీప్‌ 3, జాదవ్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 రన్స్ చేసి చేసి విక్టరీ సాధించింది. రోహిత్‌ శర్మ (48) టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు.

గెలిపించిన బౌలర్లు..

నార్మల్ టార్గెట్ ని ఛేదించే క్రమంలో ఫస్ట్ ఓవర్లోనే 10 రన్స్ తో.. భారత్‌ శుభారంభం చేసింది. అయితే.. టోర్నీలో తొలిసారి 50 పరుగుల లోపే మొదటి వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. దూకుడుగా ఆడే క్రమంలో శిఖర్‌ ధావన్‌ (15) ఔట్ కాగా..  అంబటి రాయుడు (2) విఫలమయ్యాడు. రోహిత్‌ మాత్రం దూకుడు కొనసాగిస్తూ భారీ షాట్లు ఆడాడు. అయితే హాఫ్ సెంచరీకీ చేరువైన సమయంలో మరోసారి పుల్‌ షాట్‌ కు ప్రయత్నించి డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ లో క్యాచ్‌ ఇవ్వడంతో.. అతని ఆట ముగిసింది. దినేశ్‌ కార్తీక్‌ (37), ధోని కలిసి ఇన్నింగ్స్‌ న నడిపించారు. ఆరంభంలో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా… ఆ తర్వాత వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్‌ చేశారు. తాను ఎదుర్కొన్న 23వ బంతికి ధోని తొలి ఫోర్‌ కొట్టాడు. ధోనితో నాలుగో వికెట్‌కు 14 ఓవర్లలో 54 రన్స్ జోడించిన అనంతరం కార్తీక్‌ ఔట్ అయ్యాడు.  కొద్ది సేపటికే ముస్తఫిజుర్‌ బౌలింగ్ లో ధోని కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత జాదవ్‌  గాయంతో తప్పుకోవడంతో.. ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే టీమిండియా బౌలర్లు జడేజా, భువనేశ్వర్‌, కుల్దీప్ యాదవ్.. తీవ్రమైన ఒత్తిడిని తట్టుకొని భారత్‌ ను విజయానికి చేరువ చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates