ఆసియాకప్-2018 : ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌ తో ఇవాళ(సెప్టెంబర్-28) జరుగుతున్న ఆసియా కప్-2018 ఫైనల్ మ్యాచ్‌ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకొంది.  టోర్నీలో భాగంగా గత శుక్రవారం(సెప్టెంబర్21) సూపర్-4 దశలో ఈ రెండు జట్లూ ఢీకొనగా.. భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే భారత్ చేతిలో ఓడినా.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాక్ లను ఓడించి బంగ్లాదేశ్ ఫైనల్‌ కి చేరుకుంది.

మరోవైపు టోర్నీలో అత్యద్భుతంగా రాణిస్తున్న భారత్ జట్టు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండా నేరుగా ఫైనల్‌ కి చేరుకుంది. అఫ్గానిస్థాన్‌- టీమిండియా మధ్య  మంగళవారం జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

ఆసియా కప్‌ చరిత్రలో భారత్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటి వరకు 11 సార్లు తలపడగా.. టీమిండియా 10 సార్లు విజయాల్ని సాధించింది. అందుకుంది.

Posted in Uncategorized

Latest Updates