ఆసియాలోనే ఫస్ట్ : తెలంగాణలో అతిపెద్ద స్టెంట్ల కంపెనీ

హైదరాబాద్: రాష్ట్రానికి బిగ్ ప్రాజెక్ట్ రాబోతోంది.  ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ ప్లాంట్ తెలంగాణలో ఏర్పాటు కానుంది. రూ. 250 కోట్లతో గుండెకు సంబంధించిన స్టెంట్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు కానుంది. SMT కంపెనీ టీమ్ ఇవాళ (అక్టోబర్-2) మంత్రి కేటీఆర్‌ తో సమావేశమైంది. హార్ట్ కు సంబంధించి కణాలు ఎలా అవసరమవుతాయి అనే విషయాలను కేటీఆర్ కు వివరించారు సంస్థ ప్రతినిధులు. దేశంలో అతి తక్కువగా తయారయ్యే ఈ కంపెనీ తెలంగాణలో ఏర్పాటుకావడంతో సంతోషం వ్యక్తం చేశారు కేటీఆర్.

SMT కంపెనీ సుల్తాన్‌ పూర్ మెడికల్ డివైజెస్‌ పార్కులో పెట్టుబడి పెట్టనుంది. ప్రభుత్వ విధానాలు, అత్యుత్తమ మౌలిక వసతుల వల్లే హైదరాబాద్‌ ను సెలక్ట్ చేసుకున్నట్లు తెలిపారు కంపెనీ ప్రతినిధులు. కంపెనీ రాకతో 2 వేలకి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపింది SMT కంపెనీ. త్వరలోనే కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపింది కంపెనీ టీమ్.

Posted in Uncategorized

Latest Updates