ఆసియా కప్ ఫైనల్ : భారత్ టార్గెట్ 223

దుబాయ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లా టీం 48.3 ఓవర్లలో 222 రన్స్ చేసి ఆలౌటైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా బంగ్లాదేశ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.  దీంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లా జట్టు  222 పరుగులు చేసి… భారత్ కు 223 రన్స్ టార్గెట్ ఇచ్చింది. బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ 121 పరుగులు చేయగా..సౌమ్య సర్కార్ 33,మెహదీ హసన్ 32 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్ 3 వికెట్లు, కేదార్ జాదవ్ 2 వికెట్లు తీయగా.. భుమ్రా,చాహల్ చెరో వికెట్ పడగొట్టారు.

Posted in Uncategorized

Latest Updates