ఆసియా కప్ షెడ్యూల్‌పై బీసీసీఐ ఫైర్

ఆసియా కప్ క్రికెట్‌ షెడ్యూల్‌పై BCCI ఆగ్రహం వ్యక్తం చేసింది. టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 19న పాకిస్తాన్, భారత్ తలపడనున్నాయి. ‘భారత్‌ వరుసగా రెండు రోజులు రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. 18న క్వాలిఫయర్ జట్టుతో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత రోజే 19న మళ్లీ పాక్ తో టీమిండియా ఆడాల్సి ఉంటుంది. ఇది ఎలా సాధ్యమంటూ ప్రశ్నించింది BCCI. 16న క్వాలిఫయర్ టీమ్‌తో ఆడిన పాక్ రెండు రోజుల గ్యాప్ తీసుకుని భారత్‌తో తలపడుతుంది. పాక్‌కేమో రెండు రోజులు విరామం ఇచ్చారు. భారత్‌ మాత్రం ఎటువంటి విరామం లేకుండా మ్యాచ్‌కు సిద్ధపడాలా.. దీనికి ఎంతమాత్రం అంగీకరించలేమన్న బీసీసీఐ.. ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. ఫైనల్ మ్యాచ్‌ సెప్టెంబర్ 28న జరగనుంది.

మరోవైపు ఏషియా కప్ నుంచి వైదొలగండి అంటూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్… టీమ్‌కు పిలుపునిచ్చాడు. కోహ్లి సేన వరుగా రెండు రోజులు వన్డే మ్యాచ్‌లు ఎలా ఆడుతుందని ప్రశ్నించాడు. షెడ్యూల్ చూసి నేను షాక్ తిన్నానని.. ఇది కచ్చితంగా సరైన షెడ్యూల్ కాదని స్పష్టం చేశాడు.

Posted in Uncategorized

Latest Updates