ఆసియా కుబేరుడు అంబానీ

మరో ఘనత సాధించాడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ. అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మానును వెనక్కునెట్టి ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు అంబానీ. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ ధర శుక్రవారం 1.6 శాతం పెరిగి రూ.1,099.80 ఆల్‌టైమ్‌ హై స్థాయికి చేరింది. దీంతో అంబానీ సంపద 44.3 బిలియన్‌ డాలర్ల(దాదాపు 3.05 లక్షల కోట్లు)కు పెరిగిందని పేర్కొంది బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌.

జాక్‌ మా సంపద విలువ 44 బిలియన్‌ డాలర్లు(3.03 లక్షల కోట్లు)గా ఉంది. ఈ ఏడాది ముకేశ్‌ అంబానీ సంపద 4 బిలియన్‌ డాలర్లమేర పెరిగితే, జాక్‌ మా సంపద 1.4 బిలియన్‌ డాలర్ల మేరకు తగ్గింది. దీనితో అంబానీ ఆసియాలోనే కుబేరుడయ్యాడు.

Posted in Uncategorized

Latest Updates