ఆసియా గేమ్స్ : భారత్ నుంచి 524 ప్లేయర్లు

ASIAN GAMESప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 18వ ఆసియా గేమ్స్ ఆగస్టులో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పలు దేశాల్లో ఎంత మంది ప్లేయర్లు పాల్గొంటారనేదానికి క్లారిటీ ఇచ్చారు నిర్వహకులు. ఈ క్రమంలోనే ఆసియా గేమ్స్‌ లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందాన్ని భారత ఒలింపిక్ సంఘం(IOA) మంగళవారం (జూలై-3) ప్రకటించింది.

భారత్ తరఫున మొత్తం 524 మంది క్రీడాకారులు ప్రతిష్ఠాత్మక క్రీడల్లో 36 విభాగాల్లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.  ఇందులో 277 మంది పురుషులు, 247 మంది మహిళా అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇండోనేషియా ఆతిథ్యమిస్తున్న క్రీడలు వచ్చే ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 మధ్య జరగనున్నాయి. సౌత్ కొరియాలోని ఇంచియాన్‌ లో 2014లో జరిగిన గేమ్స్‌లో 28 విభాగాల్లో 541 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఏడాది కొత్తగా ఎనిమిది క్రీడలకు చోటు కల్పించారు. రెండు నెలల క్రితం ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌ లో భారత క్రీడాకారులు పతకాలతో చెలరేగి.. మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే స్ఫూర్తితో మరో మెగా టోర్నీలో సత్తాచాటేందుకు మరోసారి రెడీ అవుతోంది టీమ్ ఇండియా.

Posted in Uncategorized

Latest Updates