ఆసీస్ తో చివరి రెండు టెస్ట్ లు.. భారత జట్టు ఇదే

ఆసీస్ తో జరిగే చివరి రెండు టెస్ట్ మ్యాచ్ లకు భారత టీంను బీసీసీఐ అనౌన్స్ చేసింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ లో మూడు,నాలుగో టెస్ట్ కు మొత్తం 19 మంది ప్లేయర్స్ తో జట్టును ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాతో పాటు టెస్ట్ అరంగ్రేటం కోసం వెయిట్ చేస్తున్న మయాంక్ అగర్వాల్ చివరి రెండు టెస్ట్ లకు ఎంపికయ్యారు.

ఈ నెల 25 నుంచి మెల్‌బోర్న్ స్టేడియం వేదికగా మూడో టెస్ట్, జనవరి 2,2019 నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగనుంది.

చివరి రెండు టెస్ట్ లకు భారత జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మురళీ విజయ్, చతేశ్వర్ పూజారా, కె ఎల్ రాహుల్, హనుమ విహారి,రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా,ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా,  భువనేశ్వర్ కుమార్, పార్థీవ్ పటేల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్.

Posted in Uncategorized

Latest Updates