ఆసీస్ తో ఫస్ట్ టెస్ట్.. భారత జట్టు ఇదే

అడిలైడ్ వేదికగా రేపటి(డిసెంబర్ 6) నుంచి ప్రారంభం కానున్న ఫస్ట్ టెస్ట్ కు ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత జట్టును బీసీసీఐ ఇవాళ అనౌన్స్ చేసింది. మొత్తం 12 మంది ప్లేయర్స్ తో టీంను ప్రకటించిన బీసీసీఐ.. రోహిత్ శర్మకు టీంలో చోటు కల్పించింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ లను బెంచ్ కే పరిమితం చేసింది.

ఇక ఆస్ట్రేలియా 11 మంది సభ్యులతో ఫైనల్ టీంను ప్రకటించింది. ఇక రీసెంట్ గా జరిగిన టీ20 సిరీస్ లో రెండు టీమ్స్ ఒక్కో మ్యాచ్ లో విజయం సాధించగా.. ఒక మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దయ్యింది.

టీమిండియా లిస్ట్..

విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), ఆజింక్య రహానే(వైస్ కెప్టెన్), ముర‌ళీ విజ‌య్‌, కేఎల్‌ రాహుల్‌, ఛటేశ్వర్ పుజారా, రోహిత్‌ శర్మ, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌(వికెట్ కీప‌ర్‌), రవిచంద్ర‌న్‌ అశ్విన్‌, మహమ్మద్ షమీ, ఇషాంత్‌ శర్మ, జస్ర్పిత్‌ బుమ్రా

 

Posted in Uncategorized

Latest Updates